పువ్వులు పిల్లల నవ్వులు  లేని ప్రపంచాన్ని ఊహించలేము అన్నాడో కవి అందమైన పూల తోటలు తలచుకుంటే ఊటీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.1948 లో 55 ఎకరాల్లో ఏర్పడ్డ ఈ గార్డెన్ వేలాది పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. గత సంవత్సరం అక్టోబర్ లో 124 వ ఫ్లవర్ షో ఉత్సవం జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కానీ అప్పటికే గార్డెన్ నిర్వాహకులు 259 రకాలకు చెందిన 25 వేల పూలమొక్కలు సేకరించారు. లాక్ డౌన్ కారణంగా ఈ ఫ్లవర్ షోను వర్చువల్ గా జరుపుతున్నారు.ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గార్డెన్ లో ఒక చోటే 2500 పూల కుండీలతో కోవిడ్-19 వ్యాక్సినేట్ యువర్ సెల్ష్ అనే సందేశాన్ని ఇచ్చారు. కోవిడ్ కారణంగా నిజంగానే ఇల్లు కదలటం కష్టం ఈ వర్చువల్ ఫ్లవర్ షో మాత్రం ఎక్కడ నుంచి చూసినా ఊటీ లో తిరుగుతున్న అనుభూతినే ఇస్తోంది వేలాది మొక్కలు ఎన్నో రంగులు, రకాల పువ్వులు ఎవరో అజ్ఞాత చిత్రకారుడు మనసుపెట్టి శ్రద్ధగా గీసినట్లు అద్భుతంగా ఉన్నది .ఊటీ వరకు ఎలాగో వెళ్లలేం. కనీసం ఇంట్లోంచి అయినా ఈ పూల ఉత్సవాన్ని కళ్లారా చూసి ఆనందించవచ్చు ఎన్నెన్నో వర్ణాలు రూపాలు ఒకదానికి ఇంకొక దానికి సంబంధం లేని రూపం సున్నితమైన సోయగం, కరోనా లాక్ డౌన్ లో మనసులో ఒత్తిడి పోవాలంటే ఇలాంటి కనువిందైన దృశ్యాలను చూడాలి ప్రకృతికి ఎంతైనా రుణపడి ఉంటాం ఇంత అందమైన పువ్వులను మనకోసం సృష్టించి ఇచ్చినందుకు !

Leave a comment