Categories
పంటికి సంభందించిన పరీక్షలు చేయించుకుంటూ వుంటే ఎముకలు ఎంత పటుత్వంతో ఉంటాయో తెలుస్తుంది అంటున్నారు పరోశోధకులు.పంటి పరీక్షల ద్వారా ఎముకల క్షీణతను కనుక్కోవచ్చని తాజా అద్యాయనం తెలిపింది.ఐదు వేల మంది డెంటల్ ఎక్సరేలు క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఈ నిర్ణయానికి వచ్చారు. కీళ్ళ నొప్పులు ముందే రాబోతున్నాయని తెలిపారు. సమస్య మొదలయ్యాకే వ్యాధి నిర్దారణ జరుగుతుంది.ఇది సామాన్యంగా జరిగే విషయం .పంటి ఎక్సరేల్లో కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని ముందే తెలుసుకోవచ్చు అంటున్నారు. నలభై ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్ గా దంతపరీక్షలు చేయించుకోమని సూచిస్తున్నారు.