సాధారంణంగా పిల్లలకు తల్లులు వంటగదిలో పనులు అప్పగించరు. ఒక వేళ వాళ్ళు ఏదైనా చేయబోయినా వారించేస్తారు. కానీ పిల్లలకు చిన్నతనం నుంచి వంటగదిలో ప్రావీణ్యత వచ్చేలా చేయమని తల్లులను హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. కమ్మగా అమ్మవండితే తిన్నట్లుగా ఎవరికి వాళ్ళు చక్కగా వండుకొనేలా చేస్తే ఆ వంట ప్రావీణ్యత వాళ్ళకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.మాస్టర్స్ చేసేందుకు ఏ అమెరికానో వెళ్ళాలి లేదా ఏ సిటీలోనో చదువు కోవాలి .చదువు తో పాటు బోలెడు కోచింగ్స్ తీసుకోవాలి ,హాస్టల్స్ లో ఉండటం కుదరకపోతే ఒక్క వంటపని వస్తే వాళ్ళు సగం సమస్య నుంచి బయటపడినట్లే వంట అభిరుచిలో ఆసక్తితో కాదు అవసరంతో నేర్చుకోవాలి. తల్లి ,తోబుట్టువులు ఏ ఊరు వెళ్ళినా చిన్న అనారోగ్యలు వచ్చిన ఇల్లు అస్థవ్యస్థం అయిపోతుంది. పిల్లలు ఇంటి పనులు శ్రద్ధగా నేర్చుకొంటే వాళ్ళకి వాళ్ళ ఇల్లు దిద్దుకొనే నేర్పైనా ఉంటుంది.
Categories