
శిల్పా శెట్టి పేరు వింటే యోగా ,చక్కని డైట్ ,ఫిట్ నెస్ గుర్తోస్తాయి.శిల్పా శెట్టి కుంద్రా మంచి యాక్టర్ ,నిర్మాత ,మోడల్. బాజీగర్ తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. బిగ్ బ్రదర్ సీజన్5 విజేత. ఎన్నో బ్రాండ్స్ కు ప్రచార కర్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని. పెటా సపోర్టర్. వీటన్నింటి కంటే శిల్పా మంచి రైటర్. మంచి ఆహారం చక్కని వ్యాయామంతో ఎవరైన అందం కాపాడుకో వచ్చనే సూత్రంలో ది గ్రేట్ ఇండియన్ డైట్ అనే పుస్తకం రాసింది శిల్పా. ఆ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. ఈ సంవత్సరం ది డైరీ ఆప్ ఎ డొమెస్టిక్ దిలా అనే పుస్తకం రాశారామె. నిమిషాల్లో తయారు చేసుకొనే వంటలున్న ఈ పుస్తకం అమ్మకాలు పరుగులు పెడుతుంది.