Categories
మహిళల జీవితంలో తప్పని దశ మెనోపాజ్. ఇది కొందరిలో చాలా ముందుగా మరికొందరిలో చాలా లేటుగా ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరిలో మరింత ముందే మెనోపాజ్ రావటానికి కారణం వాళ్ళు తీసుకొనే ఆహారం అంటాయి అధ్యయనాలు. ఇటీవలే తాజా పరిశోధన అన్నం ప్రధాన ఆహారంగా తీసుకొనే వారిలో ఈ దశ ముందుగా మొదలవుతుంది అంటున్నారు .లండన్ యూనివర్సిటీ వెయ్యి మంది మహిళలో కౌమారపు అలవాట్లపైన సుదీర్ఘకాలం అధ్యయనం చేస్తే కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నా అన్నం పాస్తా వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకొంటే మెనోపాజ్ తొందరగా వస్తోందని పరిశోధన ఫలితాలు చెప్పాయి.