Categories
ఒక అధ్యాయనం ప్రతి ఒక్కరు వారంలో రోజు రోజుకు బరువు తగ్గుతూ వారాంతాల్లో తిరిగి బరువు పెరిగిపోతారు అంటుంది. వారాంతంలో ఎంత బరువు పెరిగారు అన్నదానికంటే మిగతా రోజుల్లో ఎంత తగ్గారు అన్నది ముఖ్యం అంటారు పరిశోధకులు. విస్తృతంగా జరిపిన అధ్యాయనాలల్లో పాల్గొన్న వేలాదిమంది ఆది,సోమ వారాలు బరువు పెరిగి మిగతా రోజుల్లో స్థిరంగా తగ్గారు. అంటే మిగతా రోజుల్లో పని ఆహారం తగ్గించటం లేదా తీరుబాటుగా తినేందుకు సమయం లేకపోవడం కారణంగా ఉన్నాయి.సన్నగా నాజుగ్గా ఉండాలని అందరు భావిస్తారు కాని ఆ దిశగా ప్రయత్నం చేస్తారా అంటే అవునని చెప్పుకోలేరు. వెయిట్ లాస్ కోసం దీర్హకాలిక ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.కనుక వీకెండ్ ట్రీట్స్ కు మరీ తినేయకుండా మిగతా రోజుల్లాగే నియంత్రణలో ఉండవలసిందే.