కొంతమందిని ప్రత్యేకంగా తలుచుకోవాలి . గుర్తుపెట్టుకోవాలి . స్ఫూర్తి పొందాలి . దేన్నయినా సాధించాలంటే అదృష్టం,దేవుడి దయ కాకుండా సాధనతోనే సాధ్యం అని నిరూపించిన వాళ్ళు ఉన్నారు . వాళ్ళలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో తిరుగులేని చోటు సంపాదించిన వికాష్ కుమార్ ఒకరు . ఢిల్లీ కి చెందిన ఈ యువకుడు కథక్ డాన్సర్ . ఈ నృత్యంలో ఎంత పట్టు సంపాదించాడంటే,ఆ నాట్యం చేస్తూ నిముషంలో 120 సార్లు బొంగరంలా తిరగగలడు . గిన్నిస్ బుక్ లు ఈ రికార్డ్ ను ఇంతవరకు ఎవ్వరు బద్దలు కొట్టలేకపోయారు . ఇతని డాన్స్ వీడియోలు చూస్తూ ఉంటే ఇంత కష్టమైన అంశాన్ని కేవలం సాధనతోనే సాధించాడని తెలిసిపోతుంది . మనిషికి అసాధ్యం ఏదీ లేదని నిరూపించి చరిత్రలో స్థానం సంపాదించుకొన్నారు ఇలాటివాళ్ళు .

Leave a comment