కొన్ని అద్యాయనాలు ఆలోచనలో పడేస్తాయి. డబ్బే సరస్వం కాదు డబ్బుతో అన్ని సమకూరవు మమతానుబంధాలను డబ్బుతో కొనలేము. వీటిని చిన్నప్పటి నుంచే వింటాం. కాని ఒక అధ్యాయనం డబ్బుకు ఆరోగ్యానికి సంబంధం ఉంది అంటుంది. డబ్బుతో ఆనందం ఉందో లేదో కాని ఆయుర్ధాయం మాత్రం పెరుగుతుందట. ఆదాయం బావుండి ఆర్ధికపరమైన ఒత్తిడి లేనివారిలో ఎక్కువ మంది 15 శాతం అధికకాలం జీవించారని సర్వే రిపోర్ట్స్ నివేదిక ఇచ్చాయి. ఆదాయం అధికంగా ఉన్న వారు మెరుగైన ప్రవర్తన, పొగ తాగే అలవాటుకు దూరంగా ఉండటం భారీ కాయం లేకపోవటం అద్యాయనంలో గమనించారట. డబ్బు నిజంగానే సర్వస్వం కాదు గాని ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్న మాట మటుకు వాస్తవం.

Leave a comment