Categories
నువ్వుల్లో తెలుపు, నలుపు రంగులే కాదు ఎరుపు,ముదురు గోధుమ,లేత గోధుమ ఇంకా చాలా రకాలున్నాయి. అన్నింటిలోకి నల్ల నువ్వులు మరింత శ్రేష్టం అంటారు చైనా సంప్రదాయ వైద్యులు. వీటిలో కాల్షియం ఎక్కువ.సెసామిన్ .సెసామోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువే. తెల్ల జుట్టుల్ని, శరీరంపైన వచ్చే ముడతలను నివారిస్తాయని చెపుతున్నారు. కీళ్ళ నొప్పులు వారు నువ్వులతో చేసినవి తింటే శరీరానికి అవసరమైన కాల్షియం దొరుకుతుందంటున్నారు. కాల్షియం, ఐరన్,మెగ్నిషియం,కాపర్వంటి ఖనిజాలు ,బి-మిటమిన్లు ప్రోటీన్లు వంటి పోషకాలకు నిలయమైన ఈ బుల్లి గింజలు చెడు కొలెస్ట్రాల్ తొలగించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.