Categories

సరైనా ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పక వ్యాయమం చేస్తూ ఉంటే రెండు మూడు నెలల్లో పది కిలోలు తగ్గిపోవచ్చు. అయితే ఆహారం సరైన సమయంలో తీసుకోవాలి. పళ్ళు ,కూరగాయాలు ఎక్కువగా ఉండాలి. పప్పు ,గుడ్డు ,వెన్న తీసిన పాలు ,పెరుగు కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడతాయి. ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండే వరకు తినవద్దు. స్నాక్స్ ఆరోగ్యవంతమైనవి అయి ఉండాలి. పండ్లు ,శనగలు మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పోషకాలుంటాయి. అలాగే శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ పెట్టాలి. నడక ,పరుగు వంటివి కనీసం ముప్పై నిమిషాల నుంచి 60నిమిషాల వరకు చేయాలి. దీన్ని పాటిస్లూ పోతే బరువు నియంత్రణలో ఉంచుకోవటం సులభమే.