Categories
కమలాలు సాధారణంగా తొక్క వలిచి పడేసి లోపల తొనలు తినేస్తారు. కానీ కమలా, ద్రాక్ష పండ్ల పై తొక్కలు లిమోనిన్ అనే పదార్ధం క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. బాగా కడిగిన కమలా,ద్రాక్షపై తొక్కలను సూప్ లో బేకింగ్ పదార్ధాలు, పెరుగు లేదా వేడి టీలో కలుపుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ కమలా పండు తొక్క అడుగున కనిపించే తెల్లని పొర తీసేయనక్కర్లేదు. దీన్ని పిలో చెడో అంటారు. కరిగిపోయే పీచు పెక్టిన్ కు ఇది మరీ అధికం.కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కమలా వంటి సిట్రిక్ పండులో వృధా అనేదే ఉండదు. ఈ పండుతో జ్యూస్ లో ఉండే విటమిన్ సి శరీరంలో అనేక పదార్ధాల్లో ఉండే కాన్సర్ లో పోరాడే గుణాలను గ్రహించేందుకు తోడ్పడుతోంది.