షాపింగ్ ఒక ఖరీదైన వ్యసనం. వస్తువులు అవసరమే కానీ ఏది అవసరం ఏది కాదు అని అర్థం చేసుకోకపోవటం పొరపాటు. అందుకే అవసరమైన వస్తువుల జాబితా ముందే తయారు చేసుకొని కుటుంబంలోని ఇతర సభ్యుల అవసరాలు కూడా తెలుసుకొని అప్పుడే బడ్జెట్ పైన ఒక కన్నెసి షాపింగ్ చేయటం తెలివైన పని. అంతేగాని మాల్ లో కనబడ్డ ప్రతి వస్తువుపై దృష్టి వెళ్ళిపొయి ప్రదర్శన కోసం కోనటం లేదా కొనకుండా ఉండలేని బలహీనతలతో షాపింగ్ చేయటం వ్యసనం అంటారు. ఒక వేళ కొనే అలవాటు కాస్త ఎక్కువే ఉన్న దాన్ని ఆత్మశోధనతో ఈ వప్తువు నాకు తక్షణ అవసరమా? దాన్ని ఉపయోగించుకొంటానా? ఇంతకంటే ముఖ్యమైన అవసరమైన వస్తువు కొనాల్సిన లిస్ట్ లో ఇంకేదైనా ఉందా అన్న ప్రశ్నలు వేసుకొంటూ అనవసరపు కొనుగోళ్ళ వ్యసనం వదిలించుకొంటే జీవితం మీ అదుపులో ఉంటుంది అంటారు విశ్లేషకులు.

Leave a comment