Categories
డిజైనర్ చెప్పులు ఇప్పుడు ప్రతి సందర్భానికి ప్రతి ఫ్యాషన్ లేదా సంప్రదాయ వస్త్రశ్రేణి మీదకు అందంగా అమరిపోతాయి. మామూలు చెప్పులే ఇప్పుడు జరీ అంచులు చుట్టేసుకొని రంగురాళ్ళు అద్దుకొని సీక్వేన్ల మెరుపులతో రకరకాల డిజైన్లతో ఆకట్టుకొంటున్నాయి. అలాంటి వాటిలో ముందున్నాయి జూతీలు. చేడీదార్ ,అనార్కలీ పలాజో ,పొడవాటి టాప్ గాగ్రా క్రాప్ టాప్ లెహాంగా ,కుర్తీ ,ధోతీ ఫ్యాంటు పటియాలా ఇలా అన్నిరకాల ప్యాషన్ వస్త్రాలకు జూతీలు మంచి జోడీ. జూతీ హైహీల్స్ కూడా మెరుపుతో స్వీకెన్లతో మరింత అందంగా ఉన్నాయి. దుమ్ము పట్టిన కాస్త బ్రష్ తో దులిపేసి మెత్తని గుడ్డతో తుడిచేస్తే కొత్త విలాగ ఉంటాయి.