Categories
ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలేనా? బోరుకొడుతున్నాయి అనుకొనే వాళ్ళ కోసం కొత్త కొత్త యోగా ప్రకియలు వచ్చాయి. వాటిలోఒకటి ఏరియల్ యోగా .సీలింగ్ కు ఉండే హాక్ కి ఓ క్లాత్ వేలాడదీసి ఈ కొత్త యోగాని పరిచయం చేశారు చిన్నప్పుడు ఆడినా ఉయ్యాల ఆటను కాస్త తిరగేసి ఆడాలన్న మాట. ఈ క్లాత్ సాయంతో గాల్లో తేలుతూ వేసే యోగాసనాలు ఇప్పటికే వైరల్ .జిమ్నాస్టిక్ ,కరాటే కుంగ్ ఫూల్లోని కొన్ని ముద్రలు ఇందులో కలిపారు. భ్యాక్ పెయిన్ ,మెడనొప్పులు మహిళలకు సంబంధించిన ఇతరత్రా సమస్యలు తగ్గి పోతాయన్నమాట ఈ యోగాతో.