బాలీవుడ్ అగ్ర కథానాయక దీపికా పదుకోనేకు కొత్త గౌరవం దక్కింది.మామి(ముంబై అకాడమీ ఆప్ మూవింగ్ ఇమేజ్ )చిత్రోత్సోవాలకు ఆమె కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. గత నాలుగేళ్ళుగా అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ ఈ పదవిలో ఉన్నారు. ఇది నాకు దక్కిన గౌవరం. అంత కంటే గొప్ప బాధ్యత .సినిమా ప్రేమికులను సినీ ప్రముఖులను ఒక్కచోట చేర్చే మామి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతాను అంటోంది దీపికా.