అమెరికాకు చెందిన ఫారూక్ జేమ్స్ పొడవాటి ఉంగరాల జుట్టుతో అతని రెండో ఏట నుంచే ఇన్ స్ట్రాగ్రామ్ లో పాపూలర్ అయ్యాడు.అతనికి రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు అతనికి ఏడేళ్ళు. ఇతనికి ఉన్న పొడవాటి ఉంగరాల జుట్టు వల్లనే లండన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పైన నడిచే అవకాశం వచ్చంది. ఆరు నెలల వయసు నుంచే మోడలింగ్ మొదలు పెట్టిన ఫారూక్ హెయిర్ స్టైల్ కోసం ఫ్యాషన్ సంస్థలు క్యూ కట్టాయి. ఫారూక్ తల్లి బోన్ని మాట్లాడుతూ బయటకు వెళితే చాలు ఫారూక్ ని చూసేందుకు అతని జుట్టు ముట్టుకొనేందుకు చుట్టు మట్టేస్తారు. అతనితో ఫోటోలు తీయించుకొనేందుకు ఎంతో ఇష్టపడతారు అంటోంది.