పెళ్ళి జరుగుతుంటే ఏకంగా సినిమా సెట్లే, పెళ్ళి పందిళ్ళు గా తీర్చి దిద్దుతున్నా ఈ రోజుల్లో వట్టి పూవులతో అంత అందాన్ని తెచ్చిపెడుతున్నారు. సృజనకారులు . పచ్చని బంతి పూలు ముద్దుగా ఉంటాయి. వెంటనే వాడి పోవు కూడా. ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని మెహందీ ,పెళ్ళకూతుర్ని చేయటం, గౌరీపూజ వంటివి పెళ్ళిలో భాగంగా చేసే వేడుకలకు బంతి పూలతో వేదికలు నిర్మిస్తున్నారు. బంతి పూలు ,శాటిన్ అరటి మొక్కలు కలగుపుకోని పసుపు ఎరుపు రంగుల బంతి పూలతో దండలు అల్లి పందిళ్ళను త్రిడీ లుక్ తో అలంకరిస్తున్నారు. వీటికి లిల్లీలు మల్లెలు కలిపితే పందిరి సువాసనల మయం .ఇదంతా కలిపి ,మొత్తం రంగుల సమ్మోహనం .ఇంటివాకిలికి బంతిపూల తోరణాలు వేలాడాదీస్తేనే పండగ కళ వస్తుంది. అలాంటిది మొత్తం పెళ్ళిపందిరే బంతిపూల అలంకారాలైతే ఆ రంగుల కలపోతని చూసేందుకు ఎన్ని కళ్ళు కావాలి.

Leave a comment