మగవాళ్ళ శరీరాలు ఆడవాళ్ళ శరీరాలు ఒక్కటే మగవాళ్ళు పొట్టి దుస్తులు ధరిస్తే రాని కామెంట్స్ ఆడవాళ్ళు ధరించ గానే వస్తున్నాయి. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అది మా ఇష్టం అంటూ ఇస్టాగ్రామ్ లో రాసింది ఆహనా కృష్ణ. ఈమె మలయాళ నటి ఇప్పుడు కేరళలో హ్యాష్ టాగ్ ఎస్ వుయ్ హావ్ లెగ్స్ ఉద్యమం నడుస్తుంది. వర్ధమాన నటి అనుస్వర రాజన్ షార్ట్స్ ధరించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడితే కేరళ పురుషులు ఆమెపై దాడి మొదలుపెట్టారు. దుస్తులను బట్టి మర్యాద వస్తుంది అదే అర్థంలో వేలకొద్ది కామెంట్స్ పెట్టారు. ఆమెకు మద్దతుగా మరొక మలయాళ నటి రిమా కళింగల్ తోనూ బికినీలో ఉన్న ఫోటోలు పెట్టి ఈ ఉద్యమం మొదలు పెట్టింది స్త్రీలకు మెదడు శరీరం భుజాలు హక్కుల కలలు తెలివి తేటల తో పాటు కాళ్ళు కూడా ఉన్నాయి అంటూ మలయాళ ఇండస్ట్రీలోనే ఎంతోమంది హీరోయిన్ లు స్పందించారు ప్రస్తుతం వుయ్ హావ్ లెగ్స్ కాంపెయిన్ నడుస్తుంది.

Leave a comment