Categories
పప్పు ధాన్యాలు పోషకాహార పవర్ హౌజ్ వంటివి. చాలా పప్పుల్లో ఐరన్ ,జింక్,పోలేట్,ప్రోటీన్లు ,పీచు ఇతర పోషకాలుంటాయి. వీటిలో అనారోగ్యకర సాచులెట్ ఫ్యాట్ ఉండవు. సహాజ రూపంలో వీటిలో గ్లైకమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. పెద్ద ఖరీదు కూడా ఉండవు. శనగలు ,బఠానీలు,బీన్స్ వేరు శనగలు ఇవన్ని పప్పులే. వీటిని నానబెట్టి ఉడికించటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. వీటితో తాజా కూరగాయలకు కలిపి కూర చేయవచ్చు.పిండితో సూప్ లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. మాంసాహారానికి దూరంగా ఉండే వారికి ఈ వృక్ష సంబందిత ప్రోటీన్లు ఎంతో ఆరోగ్యం ఇస్తాయి.