Categories
మంచి నిద్రకు మంచి తలదిండు చాలా అవసరం.సరైన దిండు వాడకపోతే విశ్రాంతి దొరక్కపోగా లేని పోని తల నొప్పులు వస్తాయి. దిండు ఎత్తు ,మెత్తదనంలోని తేడా వల్ల మెడనొప్పి ,భుజం నొప్పి వచ్చేస్తాయి.చేతులు తిమ్మిర్లు వస్తాయి. మంచి దిండు వాడినా ,దాన్ని సరైన పద్దతిలో పెట్టుకోకపోతే సమస్యే. తల మరీ ఎత్తుకు పెట్టుకో కూడదు. దిండు ఇక అంచున కిందగానూ వద్దు. దిండు కవర్ నాలుగు రోజులకు ఒక సారి మార్చాలి.మురిగ్గా ఉంటే శ్వాస సమస్యలు వస్తాయి. అసలు దిండునే రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం వాడితే అనారోగ్యం వాటిలో చేరే ఫంగస్ తల దుమ్ము ,సూక్ష్మ జవులు శ్వాస సమస్యలను తెచ్చిపెడతాయి.