Categories
ఈ వేసవికి నిజమైన రక్షణ ఇవ్వగలిగేది పుచ్చకాయ,ఇందులో 50 శాతం నీరు దాహాం తీర్చేందుకు ఉత్తమంగా పని చేస్తుంది. చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.పుచ్చకాయలో ఎర్రని భాగంలో ఎన్నో పోషకాలు ఉంటాయి ,తెల్లని భాగంలోనూ సగానికి పై గానే ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గా కాన్సర్ నిరోధకంగా పని చేసే లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్ళ కూరగాయలతో పోలిస్తే పుచ్చకాయలో చాలా ఎక్కువ. పుష్కలంగా ఉండే సి విటమిన్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలదు ,వృద్ధాప్య లక్షణాలను నిరోధించటంలో ముఖ్యపాత్ర పోషించే సిట్రిల్లైన్ పుచ్చకాయలతో అధికంగా కనిపిస్తుంది..