Categories
డిసెంబర్ జనవరి నెలల్లో అగ్ని వంటి ప్రకాశమైన నారింజ రంగు పువ్వులతో నిలువెల్లా పూసే ఆరెంజ్ ట్రంపేట్ క్రొపర్ చాలా తేలికగా పేంచ గలిగే మొక్క. దీని శాస్రీయ నామం బిగ్నానియా వెమస్టా,లేదా పైరా స్టేజియా వెమస్టా అంటారు.గ్రీక్ భాషలో అగ్నితో మనోహరమైది అని అర్ధం.ఇది కంచల మీద ,ప్రహరీ గోడల మీద గ్రౌండ్ కవర్ గాను బాగుటుంది.ఈ తీగ పువ్వులు లేనప్పుడు నిండుగా గా పచ్చని ఆకులతో అడ్డు గోడలా ఉంటుంది.సంవత్సరంలో రెండు మూడు నెలల పాటు పెద్ద పెద్ద గుత్తులతో కిందికి వెలాడే ఈ పూలు చాలా బావుంటాయి. అగ్నితీగ లేదా ఫ్లేమ్ వైం తీగను తేలుగు రాష్ట్రాలలో ఎందలని తట్టుకొని హాయిగా బతికేవే.