Categories
ఇంట్లో కాస్త ఎండపడే స్థలం ఉంటే వంటింటికి అవసరంఅయ్యే కూరగాయలు,ఆకు కూరలు పెంచుకోమంటున్నారు నిపుణులు. కాస్త లోతుగా వెడల్పుగా ఉండే కుండీలు లేదా పెద్ద నీళ్ళ డబ్బాలు,బకెట్ లు ఎంచుకుని కంపోస్ట్ ,కాక్ పిట్ కలిపిన మట్టితో వాటిని నింపుకోవాలి.తులసి,పూదినా,పచ్చి మిర్చి ,నిమ్మగడ్డి,గోధుమ గడ్డి ,పాలకూర వంటివి తక్కువ ఎండలో సులభంగా ఎదుగుతాయి.హైబ్రీడ్ విత్తనాలు బదులు సహజమైనవి ఎంచుకోవాలి.చాలా తక్కువ సమయంలో మొలకలు వస్తాయి. వాటి ఎదుగుదల విషయంలో దృష్టి పెట్టాలి.సేంద్రియ ఎరువుగా వంటింట్లో కూరగాయల తొక్కలు కాఫీ టీ పొడి వృధాలు ,బియ్యం కడిగిన నీళ్ళు మొదలైనవి మొక్కలకు బలాన్ని ఇస్తాయి.