Categories
ఎప్పుడు చూసిన స్మార్ట్ ఫోన్స్, ఇమెయిల్స్ పైన సమయం గడిపే వాళ్ళలో ఒత్తిడి ఎక్కువై అనారోగ్యాలకు గురవుతున్నారు అంటున్నారు అద్యాయనకారులు. సోషల్ మీడియాలో కాలం గడుపుతూ ఉంటే స్నేహితులతో గడపటం కుటుంబ సభ్యులతో, బందువులతో కాస్సేపైనా ఫోన్ పక్కన పెట్టి మాట్లాడకపోవడం ఇవన్ని తెలిసి చేసే తప్పులే మానవ సంబంధాలను చేతులారా పాడు చేసుకోవటమే. టెక్నాలజీ ఇంట్లో వదిలేసి హాయిగా సాయంత్రం ఎంజాయ్ చేయాలని, కనీసం నిద్రకు ఉపక్రమించేందుకు ఒక గంటైనా ఏ పుస్తకమో చదవాలనీ అదే ఒత్తిడి తగ్గిస్తుందని అధ్యయనకారులు చెపుతున్నారు.