Categories
పర్యావరణ హితమైన కట్టడాలు నీలమ్ మంజునాథ్ లక్ష్యం బెంగళూరుకు చెందిన నీలమ్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ పూర్తి చేసింది. మట్టి వెదురు కలప గడ్డి ఉపయోగించి పూర్వకాలంలో కట్టుకున్న ఇళ్ళు మోడల్ గా తీసుకోని వెదురుతో ఇళ్ళు నిర్మించాలనుకొంది. వెదురు భారత దేశంలో విరివిరిగా పండే పంట. నిర్మాణ వ్యయం తక్కువ. మానస రామ్ ఆర్కిటెక్ట్ పేరుతో సంస్థ స్థాపించి ఇళ్ళు నిర్మిస్తోందామె. ఆమె సేవలకు గుర్తింపుగా జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయి. బెంగళూర్ లోని కచ్చిన్ పార్క్ లాల్ బాగ్ పార్క్ లకు నీలమ్ రూపకల్పన చేసింది.