Categories
మహిళలు ఒక్కసారి ఎటువంటి సమస్యనైనా సునాయసంగా ఎదుర్కోంటారు. చక్కగా నిర్ణయాలు నిమిషాల్లో తీసుకోంటారు. ఒక్కసారి ఆ సామార్థ్యం తక్కువైపోతూ ఉంటుంది. దీనికి కారణం వాళ్లు తమ రుతుక్రమం సైకిల్స్ అంతటా ఎన్నో హర్మోనల్ మార్పులను ఎదుర్కోంటారు. అలాగే ఈ మార్పులు గర్భం దాల్చినప్పుడు ,మోనోపాజ్ దశలో కూడా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రోజెస్టరాన్ స్థాయిలో వివిధ దశల్లతో ప్రభావితం అవుతాయి. జ్ఞాపక శక్తి చురుకు దనం వంటివి ప్రభావితం అవుతాయి. కానీ తాజా అధ్యయనం అలా హార్యోన్ల ప్రభావం ఉన్న దాన్ని అధికమించి నిర్ణయత్మాక శక్తితో ఉండేందుకు వాళ్ళు కష్టపడతారు. ఒకే సారి పది పనులు చేయగలిగే సామార్థ్యం కూడా వాళ్ళకి ఈ నిర్ణయాలు తీసుకొని విషయంలో సహకరిస్తుంది అంటున్నారు.