జుట్టు పొడిబారిపోయి ఎండు గడ్డిలా కనిపిస్తూ ఉంటే కొబ్బరిపాలు ఈ సమస్యకి పరిష్కారం. కొబ్బరిపాలంటే తాజా కొబ్బరి నూనె కదా. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి ఆ పలు తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు చివర్లో చిట్లిపోకుండా ఉంటాయి. కొబ్బరిపాలలోవుండే పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖానికి వేసుకున్న మేకప్ తొలగించాలన్నా  కొబ్బరి పాలలో ఆలివ్ నూనె కలిపి దూది లో నెమ్మదిగా క్లీన్ చేస్తే మేకప్ పోవటమే కాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. జిడ్డు చర్మ తత్త్వం ఉన్నవాళ్లు మొటిమల సమస్య ఉంటే కొబ్బరిపాలను  క్లీన్సర్ గా  ఉపయోగించవచ్చు. కొబ్బరిపాలలో సాగే గుణం ముడతలు నివారిస్తుంది. ఈ పాలను నాలుగైదు బాదాం గింజల్ని నానబెట్టి మెత్తగా గ్రైండ్  చేసి మాస్క్ వేసుకుంటూ ఉంటే వయసు రీత్యా వచ్చే మడతలు పోగొడుతుంది.

Leave a comment