కంగనా కు ఈ మధ్య అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో జరిగిన ఆధారంగా సాజిర్ నడియార్ వాలా నిర్మిస్తున్న రొమాంటిక్ డ్రామా రంగూన్ లో కంగనా రనౌత్ జూలియా అనే సినిమా నటి పాత్రను పోషిస్తోంది. ముప్పయ్యవ దశాబ్దంలో హాంటర్ వాలే సినిమాలో స్వీట్ క్వీన్ గా నటించిన నాదియా ను తలదన్నేలా కంగనా పాత్ర ఉంటుందని దర్శకుడు విశాల్ భరద్వాజ్ పోల్చి చెప్పాడు. ఈ రంగూన్ సినిమా కధ చాలా బావుంది. ఈ సినిమాలో జూలియా పాత్ర పోషిస్తున్న కంగనా తనను నటిగా తీర్చిదిద్దిన కబీర్ ఖన్నా ను ప్రేమిస్తుంది. ఈ పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ సైనికులకు ఇండియన్ నేషనల్ ఆర్మీ కి జరిగిన యుద్ధం దృశ్యంలో మన్వా  షెర్గల్ అనే సైనికుడికి జూలియా మనసిస్తుంది. ఆ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. ఈ రంగూన్ సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలో కంగనా మార్లిన్ మన్రో అందాలతో కనబడటం ఒక ప్రత్యేకత. అరుణాచల్ ప్రదేశ్ మెక్సికో దీవుల్లో నిర్మాణం జరుపుకుంటున్న రాంజీగోం సినిమా ఫిబ్రవరి 24 న దేశవ్యాప్తంగా విడుదలవుతోంది.

Leave a comment