Categories
చల్ల చల్లగా వానలో తడిస్తే బాగుంటుంది కానీ ఆ వాన నీరు మాత్రం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ నీటిలో దుమ్ము, ధూళితో పాటు ఆమ్లాలు మిళితమై వుంటాయి. తప్పనిసరిగా నాణ్యమైన షాంపుతో శుబ్రంగా స్నానం చేయాలి. కండీషనర్ కూడా వాడాలి. జుట్టు చక్కగా ఆరనివ్వాలి. ఈ వానాకాలం ముగిసే వరకు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. షాంపులు మైల్డ్ గా ఉండేవి తీసుకోవాలి. మాడుపైన పేరుకు పోయే వాన నీటి మురికి వదిలించేలా వుంటే చాలు. ఈ కాలం చల్లగా జుట్టు ముతకగా వాసన తో వుంటుంది. మంచి షాంపూ లను ఉపయోగిస్తేనే జుట్టుకు పోషణ వుంటుంది. మంచి షాంపూలను ఉపయోగిస్తేనే జుట్టుకు పోషణ వుంటుంది. జుట్టు కుదుళ్ళకు కొబ్బరి పాలు అప్లయ్ చేస్తే ఫంగల్, బాక్టీరియా ఇన్ ఫెక్షన్లు రాకుండా వుంటాయి. వారానికోసారి నూనె రాసి మర్ధనా చేయడం కూడా అవసరమే. దాని వల్ల కుడుల్లకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. జుట్టుకు బలాన్ని ఇచ్చే మాంసాకృతులు, ఇనుము, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వుండే పదార్ధాలు ఆహారంలో చేశ్ర్చుకోవాలి. పాలకూర డ్రై ఫ్రూట్స్ చేపలు వీటిని క్రమం తప్పకుండా తినాలి.