Categories
Soyagam

జుట్టు మరమ్మత్తులు చేసే హెయిర్ బట్టర్లు.

శిరోజాల పోషణ విషయంలో హెయిర్ బట్టర్ల పేరు వినిపిస్తూ వుంటుంది. ఆరోగ్యవంతమైన మెరుపులీనే జుట్టు కోసం హెయిర్ బట్టర్ ను అప్లయ్ చేసి తేలికగా మసాజ్ చేసి ఓ అరగంట అలా వదిలివేయాలి. డ్యామేజ్ అయిన శిరోజాలకు డీప్ కండీషనిమగ్ అవసరం వుతుంది. హెయిర్ బట్టర్ లో మాయిశ్చురైజర్లు కావాల్సిన పదార్ధాలన్నీ కలిసి ఉంటాయి. జుట్టును కోట్ చేసి పరిరక్షణ మెరుపు ఇస్తాయి. పూర్తిగా వెలుపలికి కనబడే లేయర్ కు మరమ్మత్తు చేసి కోనలు చిట్లకుండా కాపాడుతాయి. జుట్టును సాఫ్ట్ గా ఉంచుతాయి. హెయిర్ బట్టర్ ను పండ్లు, బీన్స్, గింజలు, ఆకులతో తయ్యారు చేస్తారు. వీట నుంచి కొల్డ్ ప్రోసెడ్ ఆయిల్స్ వెలికి తీసి తర్వాత హైడ్రోజనేట్ చేస్తారు. ఇతర బట్టర్లు వెజిటేబుల్ ఆయిల్స్, సోయాబీన్స్, కోకోనట్, బాదాం, జోజోబా, ఉసిరి, చందనం, బ్రాహ్మి మొదలైనవి కలిసి బ్లెండ్ చేస్తారు. మధ్య ఆసియాలోని కరిటచేట్ల నట్స్ నుంచి వెలికి తీసే ఫ్యాటీ ఆయిల్ ఇది దీన్ని షియాబట్టర్ అంటూ ఉంటారు. దీన్ని లోషన్లు, క్రీమ్స్ కండీషనర్లు షాంపూ వంటి చర్మ కేశ పరిరక్షణ సాధనాల్లో వాడతారు. హెయిర్ బట్టర్ ప్యాక్ లో కలుపు కోవచ్చు.

Leave a comment