ఈ ఏడాది మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. జనవరి లో నాన్నకు ప్రేమతో విజయం మొదలై డిసెంబర్ లో ధృవ విజయంతో పూర్తయింది. ఈ సంవత్సరం నాకు చాలా లక్కీ. నన్ను లక్కీ హీరోయిన్  అంటారు కానీ అదంతా టీమ్ ఎఫెక్ట్. దర్శకుడు రచయిత మంచి సంగీతం అన్నీ  కలిసి సినిమా సక్సెస్ చేస్తాయి. నేను కష్టపడతాను అంటోంది. రకుల్ ప్రీత్ సింగ్. నా జీవితంలో పెద్ద రహస్యాలేమీ లేవు. పైగా నేను దాచిపెట్టలేను కూడా అంటోంది లక్కీ హీరోయిన్. ఎప్పుడూ నార్మల్ గా వుంటా. మేకప్ వేసుకోను షూటింగ్ లేకపోతేనే టెన్షన్. ఖాళీగా ఉంటే అస్సలు తోచదు. ఎక్కువగా ఆలోచిస్తే ముసలితనం వచ్చేస్తుందని నాకు భయం. అంటోంది రకుల్. న పని మీద నాకున్న గౌరవమే నన్నీ స్థాయికి తీసుకువచ్చింది. ఇక్కడ ఏదీ నాకు ఈజీ గా రాలేదు. ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు వరస విజయాల ఫేమ్ లో ఉన్నా. మంచి పారితోషకం ఆఫర్ చేస్తున్నారు. అందంగా ఉండటం అనేది పుట్టుకతో వచ్చిందే. ఫుడ్ విషయంలో పెద్ద జాగ్రతలేమీ వుండవు. ఫ్రూప్ట్స్ వెజిటబుల్స్ తీసుకోవటం రోజూ జిమ్ లో గంట గడపటం ఇదే నా బ్యూటీ రహస్యం అన్నది రకుల్ ప్రీత్ సింగ్.

Leave a comment