Categories
ఎయిర్ కండిషన్ ,కుర్చీలు ,సౌకర్యవంతమైన కంప్యూటర్ టేబుల్ ,ఛైర్ ఇవన్నీ వచ్చాక శ్రమ తగ్గింది కానీ అనారోగ్యాలు మాత్రం వస్తున్నాయి . ఆస్ట్రేలియా ,ఐరోపా ఖండాల్లోని పరిశోధక సంస్థలు తేల్చిన అంశం ఫలితంలో ఈ ఆఫీస్ వాతావరణం ,కాలేజ్ అవసరం లేని సేకరణలు ఆరోగ్యం చెడగొడుతున్నాయి అంటున్నారు . మధ్యాహ్నం భోజనం టేబుల్ దగ్గర కే వస్తుంది . కదలిక లేని నడక లేని జీవన విధానం డయాబెటిస్ ,బి పీ తెచ్చిపెడుతుంది . ఆఫీస్ వేళల్లో అయినా సరే అరగంటకో సారి సీట్లోంచి లేచి ,ఏ కిటికీ దగ్గరో రెండు నిముషాలు నిలబడే ప్రయత్నం అయినా చేయకపోతే ముప్పు తప్పదంటున్నాయి అధ్యయనాలు . యవ్వనం లో పర్లేదు ,మధ్యవయసు దాటే సరికి ఇక శరీరం మాట వినని పరిస్థితి వచ్చేస్తుంది అంటున్నారు .