Categories
నాన్ స్టిక్ పాత్రలను వాడటం మంచిదే అంటారు. అయితే ఈ పాత్రలను గంటల తరబడి స్టవ్ పైన ఉంచితే కోటింగ్ లోని రసాయినాలు ఆహారంలోకి వేళ్ళ ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ కోటింగ్ ఒక రకమైన పాలిపరైజ్డ్ ప్లాస్టిక్. ఈ పాత్రలపైనా ఉన్న టి ప్లాన్ కోటింగ్ కొంచెం పోయిన తిరిగి వాడకోకూడదు. పాత్రలను తోమేందుకు ఇచ్చే స్పాంజ్ తోనే తోమాలి. స్టీల్ స్పాంజ్ ఉపయోగిస్తే కోటింగ్ దెబ్బ తింటుంది. అది పొయ్యి పైన వేడి చేస్తే రసాయినం కరిగి ఆహారం లోకి వచ్చే ప్రమాదం ఉంది. కోటింగ్ రసాయనాలు కాన్సర్ కారకులుగా కూడా ఉండచ్చు వీటిని అన్ని జాగ్రత్తలు తీసుకొని వాడుకోవాలి.