మనసుకి వత్తిడి అని తోస్తే ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు సాధారణంగా . కానీ ఇలా పట్టించు కోకుండా పనులేమీ చేయకండి .కాస్సేపు ఏపని చేయకుండా ఖాళీగా కూర్చోండి అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ పద్దతిని నిక్సన్ అని నెదర్లాండ్ లో వ్యవహరిస్తారు . అక్కడ ఇదే పద్ధతి పాటిస్తారు ఖాళీగా కూర్చోని పరిసరాలను అస్వాదించటం ,కొన్ని క్షణాల పాటు బయటికి చూస్తూ ఏదీ ఆలోచించకుండా విశ్రాంతిగా గడపడం తో మనసుకు ఒత్తిడి తగ్గుతుందంటున్నారు . మెదడు పని తీరు ఆగదు సులువుగా పరిష్కారం ఆలోచిస్తూనే ఉంటుంది కనుక కాస్సేపు విశ్రాంతి గా మెదడుని గందరగోళ పరచకుండా ఉండే చాలంటున్నారు .

Leave a comment