Categories
పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని మన పెద్దవాళ్ళు అంటారు కదా ,కానీ అలా నిలబడి నీళ్ళు తాగకండి ప్రమాదం అంటున్నారు శాస్త్ర వేత్తలు . ఖచ్చితంగా కూర్చునే నీళ్ళు తాగాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు . నిలబడి తాగిన నీళ్ళు ఆహరనాళం ద్వారా జీర్ణాశయం లోనికి వెళతాయి దానితో అజీర్తి అసిడిటీ సమస్యలు తప్పవు ,కిడ్నీలకు నీరు అందదు కనుకనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి అంటున్నాయి తాజా పరిశోధనలు . నీళ్ళు కూడా ఆహారం లాగే ప్రశాంతంగా కూర్చుని నింపాదిగా తాగితే అవసరమైన శరీర భాగాలకు అందుతాయని, నిలబడి ,నడుస్తో నీళ్ళు తాగొద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్ర వేత్తలు .