Categories
అతిశయోక్తిగా చెప్పాలంటే ఫ్యాషన్ నిమిషానికో సారి మారిపోతూ ఉంటుంది. ఒక స్టయిల్ మార్కెట్ లో కొచ్చి ట్రెండ్ సృష్టించే లోపల ఇంకో కొత్త ఆవిష్కరణ వస్తోంది.చెవులకు పెట్టుకునే ఆభరణాలు ఇలాగే ఎప్పటికపుడు మారిపోతాయి కొత్తవి మార్కెట్ లో ప్రత్యక్షం అవుతాయి. జ్యూయలరీ కూడా రూపం మార్చుకోవలసిందే. ఇయర్ అఫ్ జ్యూవెలరీ మార్కెట్ లోకి వచ్చింది చెవి కిందగా పైనా ఒకే డిజైన్ ఒకే ఆకృతిలో కనిపించడం ట్రెండ్. సాంప్రదాయ దుస్తుల పైకి చక్కని ఎంపిక. రాళ్ళతో,వజ్రాలు,కెంపులతో కలిసిన గుండ్రని ఇయర్ ఆఫ్స్ కాస్త చిన్నవిగా చెవి పైగానో పెద్దవిగా దిద్దులు చాలా అందంగా వుంటాయి. ఈ రెండు ఆభరణాలు ఒక తీగలో కలపి వస్తున్నాయి. ఆలా చెవికి తగిలించుకుంటే చాలు.