ప్రపంచ వింతల్లో సైకిల్ ట్రీ కూడా ఒకటి . బ్రహ్మాడమైన చెట్టు కాండంలో ఓ సైకిల్ ఇరుక్కుపోయి ఎక్కడో సగం చెట్టులో కనిపిస్తూ ఉంటుంది . అమెరికాలోని వాషన్ ఐలాండ్ లో కనిపించే ఈ సైకిల్ ట్రీ ఎదురుగా నిలబడి చూస్తుంటే అసలది ఎలా చెట్టు మధ్యలోకి చేరిందా ఆశ్చర్యమే . ఎప్పుడో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ కుర్రవాడు తన సైకిల్ ను గొలుసుతో చెట్టుకు కట్టేసి యుద్దానికి వెళ్ళాడు . అతను తిరిగి రాలేదు . ఈ సైకిల్ కాస్త చెట్టు మధ్యలో ఉండిపోయింది . అది ఎదుగుతూ ఉంటే అలా సైకిల్ పైకెళ్ళిపోయింది అంటారు అక్కడివాళ్ళు .