Categories
2016 లో ఆస్థాజనవికాస్ పేరుతో శారీ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఔరంగాబాద్ కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసే ఆర్తి తన ఇంట్లో పోగుపడిన అనేక పాత చీరెలను ఏం చేయాలో అని ఆలోచించింది. ఇవి నిరుపేద మహిళలకు ఉపయోగపడతాయి అని భావించి తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలే స్పూర్తి సారీ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 25 వేల చీరెలను పంచింది. ఆర్తి సోషల్ మీడియాలో కూడా ఈ శారీ బ్యాంక్ కు మంచి స్పందన ఉంది డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి చేసిన ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తోంది.