Categories
గుడ్డులో ఏది మంచిది ? నాటు కోడి గుడ్డా ? ఫారం కోడి గుడ్డా ? నాటు కోడి గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఎక్కువ బలమని చాలామంది భావిస్తారు . అవే మంచివనే భావనలో ఉంటారు. ఫారం కోడి గుడ్లు తెల్లగా ఉంటాయి . నాటు గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి . పై పెంకు రంగు ఎలా ఉన్న వాటిలో పోషకాల విషయంలో మార్పు ఏమీ ఉండదు. రెండు రకాల గుడ్లలోను ఐరన్ పాళ్ళు ఒకే రకంగా ఉంటాయి . గుడ్లలోని తెల్లని సొనలో 90 శాతం నీరు మిగిలిన 10శాతం అట్టుమిన్ ,గ్లోబలిన్ వంటి ప్రోటీన్లు కొద్దిగా రైబో ప్లావిన్ (బి2)ఉంటాయి . పోషకాలు ఎక్కువ ఉండేది పచ్చసొనలోనే మాంసకృత్తులు ,కొవ్వు ,ఎ-డి-బి12వంటి రకరకాల విటమిన్లు ఫోలిక్ యాసిడ్ ,కాల్షియం ,జింక్ వంటివి ఎన్నో పచ్చసొనలో ఉంటాయి . ఏ గుడ్డు తిన్నా ఆరోగ్యమే .