వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి వాళ్ళని వత్తిడి ఇబ్బంది పడుతోంది. నిముషం తీరుబడి లేని పనితో టెన్షన్ పెరిగిపోతుంది వ్యాయామం,నిద్ర,ధ్యానం తో పాటు కొన్ని రకాల ఆహార పదార్దాలు ద్వారా టెన్షన్ తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్స్ యాంటి ఆక్సిడెంట్లు అధికంగా వుండే ఏ ఆహారమైన ఆందోళన నివారించ గలుగుతోంది. అన్ని రకాల పండ్లు, వివిధ రంగుల్లో బొప్పాయి,పుచ్చ కర్భూజా, మామిడి,అలాగే అన్ని రకాల ఆకుకూరలు పసుపు గ్రీన్ టీ కూడా టెన్షన్ తగ్గిస్తాయి. పెరుగు మజ్జిగ వంటి ఫలితాలు పెట్టిన ఆహార పదార్దాలు లోని ప్రో బయోటిక్స్ అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వల్ల కూడా మానసిక ఆందోళన తగ్గిపోతుంది.

Leave a comment