Categories
గోధుమ గడ్డి జ్యూస్ ఎన్నో ఆరోగ్య లాభాలు అంటారు న్యూట్రిషనిస్టులు . చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది . రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని నియంత్రణలో ఉంచుతుంది . గోధుమ గడ్డి ఆరోగ్య కరమైన ఆహారం గా ప్రాచుర్యం పొందింది మొలకెత్తిన గోధుమలను కొద్దిగా పెరగనిస్తే గోధుమగడ్డి వస్తుంది . దాన్ని ఇంట్లోనూ పెంచుకోవచ్చు జ్యూస్ రూపంలో పౌడర్ గాను ఈ గోధుమగడ్డి ప్రయోజనాలు ఎక్కువే . విటమిన్ ఎ ,సి ,ఇ ,ఐరన్ మెగ్నీషియం కాల్షియం అధికంగా లభిస్తాయి . ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది . ఈ గడ్డిలోని దైలాకాయిడ్స్ అనే పదార్దాల వల్ల త్వరగా ఆకలి తీరుతుంది .