Categories
పిల్లలు టీవీ ల్లో వస్తున్న హింసాత్మక సంఘటనలు, రేప్ లు లైంగిక అణచివేతలు వంటి దృశాలు చూడనివ్వండి, వాటి గురించి ప్రశ్నిస్తూవుంటారు . పిల్లలను కసరకుండా,నిజాయతీగా వారి వయసుకు అర్ధం చేసుకునే సమాచారం ఇస్తేనే మంచిది అంటారు ఎక్సపర్ట్స్. వారు అర్ధం చేసుకోలేనివి వివరించి చెప్పక్కరల్లేదు ఇలాటివి జరుగుతాయి అని చెప్పవచ్చు . ఇలాటి వాటి బారిన పడకుండా ఎలా వుండాలో ఎలా ప్రవర్తించాలో,హద్దులేమిటో ఎలా రక్షించుకోవాలో,స్త్రీ పురుష హింసల గురించి చెపుతూ వాళ్ళని తెలుసుకోనివ్వమంటున్నారు. అలాగే ఆన్ లైన్ గేమ్స్ వారి వయసుకు తగ్గట్లు ఉన్నాయా లేదో చూస్తూ వుండాలి వాళ్ళ ఆటలో, కబుర్లు,స్నేహాలపైనా ఒక కన్ను వేసి వుంచటం మంచిదే అంటున్నారు.