మార్కెట్ లో ఎన్నో రకాల హెయిర్ డై లు దొరుకుతున్నాయి . ముందుగా డైల పట్ల ఒక అవగాహన ఉంటే మంచిది సాధారణం గా ఐదురకాల డై లున్నాయి . శాశ్వతం హెయిర్ డై లో రసాయనాలు ఎక్కువ ఎనిమిది నుంచి పదివారాలు ఉంటుంది . సెమీ పర్మినెంట్ లో తీవ్రమైన రసాయనాలు ఉండవు గానీ నెలన్నర వరకు వుంటుంది టెంపరరీ డై ఒకటి రెండు సార్లు వాష్ చేస్తే పోతుంది . అమోనియా ఫ్రీ డై దాన్ని మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండాలి . సహజమైనవి గోరింటాకు బీట్ రూట్ రసం వంటివి వీటిని ఇంట్లో తయారు చేసుకోవచ్చు గోరింటాకు పొడిలో పెరుగు ,టీ డికాషన్ నిమ్మరసం కలసి నాననిచ్చి వేసుకొంటే కొన్ని వారాల పాటు తెల్లవెంట్రుకలు కనిపించవు . హెయిర్ డై వేసుకొంటున్నపుడు ముఖం పైన వైట్ పెట్రోలియం జెల్లీ రాసుకొంటే రంగు అంటకుండా ఉంటుంది .

Leave a comment