రెండు చేతులు జోడిస్తూ చేసే నమస్కారం లో సంస్కారం ,ఆధ్యాత్మికత ,ఆరోగ్యం కూడా  ప్రతిబింబిస్తూ ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మనదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లా కూడా ఈ నమస్కరం ప్రతి యోగ క్లాస్ లో వినిపిస్తూ ఉంటుంది . నమస్కారం చేయటం వల్ల ఒత్తిడి ,ఆందోళన తగ్గి చేతులు మణికట్టు వేళ్ళు అరచేతుల్లో కండరాలు సాగే గుణాన్ని పొందుతాయట . అలాగే శరీరానికి ఒక పక్కగా ,వెనక్కి తిప్పి నమస్కరం పెడితే ఆయా భాగాల్లోని గ్రంధుల పనితీరు మెరుగవుతుంది . చిరునవ్వులు చిందిస్తూ రెండు చేతులను ఛాతీ దగ్గరకు తీసుకువచ్చి నమస్కారం పెడితే శరీరంలోని 72 వేల నాడులు మేల్కొంటాయి మనసు నిండా ప్రశాంతత కలుగుతుంది . మీరు నాకన్నా అధికులు అందుకే నమస్కారం చేస్తున్నా అన్నా భావన అవతలి వాళ్ళ లోని అహాన్ని సంతృప్తి పరుస్తుంది . అందుకే అన్ని పలకరింపుల్లోనూ నమస్కారం పరమ సాత్విక మంటారు ఆధ్యాత్మిక గురువులు .

Leave a comment