Categories
బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే అది మిగతా కొవ్వులతో పోల్చితే ఎక్కువగా ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది అంటారు పరిశోధకులు . ఇలా లోతుగా ఉండే ఫ్యాట్ ను విస్ సెరల్ ఫ్యాట్ అని కూడా అంటారు .కొంత వరకు ఈ ఫ్యాట్ అవయవాల చుట్టూ కుషనింగ్ లాగా పనిచేస్తుంది కానీ ఎక్కువయితే అనారోగ్యం ప్రోటీన్ డైట్ తో ఈ ఫ్యాట్ ను కరిగించవచ్చు అంటారు .వృక్ష ఆదారిత ప్రోటీన్లు టోఫు లెంటిల్స్ ,పాలు పాలపదార్దాలు ,జంతు సంబంధిత ప్రోటీన్లు చేపలు ,మాంసం ,గుడ్లు ఆకలిని ఎదుర్కుంటాయి . ప్రొటీన్ల జీవప్రక్రియ కార్బొహేట్రేట్స్ కంటే కాస్త నెమ్మదిగా సాగుతుంది . కండరాల లాస్ నుంచి కాపాడుతుంది . అలాగే బరువు తగ్గించుకొనేందుకు చాలినంత మోతాదులో ప్రోటీన్లు అవసరం అవుతాయి .