Categories
రాత్రివేళ నిద్ర పట్టని వాళ్ళకి చక్కని సలహా ఇస్తున్నారు పరిశోధకులు . పడుకొనే ముందర గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయమంటున్నారు . నిద్రించే ముందర ఈ స్నానంతో శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది . రక్తప్రసరణ వేగం పెరుగుతుంది ఒత్తిడి కూడా కొన్ని సార్లు నిద్ర ను దూరంచేస్తుంది . శారీరక అలసట,ఒత్తిడి తగ్గాలంటే పావుకప్పు ఆలివ్ నూనె లో కొబ్బరిపాలు కలపి వేడిచేసి దాన్ని తలకు రాసుకొని మర్దనా చేయాలి . వేడినీళ్ళలో పిండిన టవల్ ను తలకు చుట్టుకొని ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే శరీరంలో రక్తప్రసరణ సరిగా జరిగి ఒత్తిడి దూరమై మంచి నిద్ర పడుతుంది . లావెండర్ నూనె కలసిన గోరువెచ్చని నీటిలో స్నానం చేసిన ఇదే ఫలితం కలుగుతుంది .