Categories
ఇంట్లో చిన్నపిల్లలుంటే చేతికి దొరికిన ఏ మార్కర్ తోనో గోడలు,ఫర్నిచర్ పైన గీసేస్తారు. అవి ఒక పట్టాన వదల కపోవటం కష్టమే . దుస్తుల పైన మార్కర్ మరకలు పడితే హాండ్ శాటి టైజర్ ను ఆ మరక రుద్ది ఉతకాలి. గోడలపైన ఏర్పడిన మార్కర్ మరకలు టూత్ పేస్ట్ లేదా హెయిర్ స్ప్రేయ తో పోతాయి. ఫర్నిచర్ పైన మార్కర్ గీతలు ఆల్కహాల్ లో తడిపిన క్లాత్ తో రుద్దితేపోతాయి. లేదా పాలతో గుడ్డ తడిపి తుడిస్తే పోతాయి. కార్పెట్ పైన మరకలు వెనిగర్ చల్లి కాసేపు ఆలా వదిలేసి తుడిచేయచ్చు సిరామిక్ పైన మరకలు టూత్ పేస్ట్ బేకింగ్ సోడా కలిపిన మిశ్రమంతో రుద్దితే పోతాయి.