Categories
తల్లులు పాలు తాగే అలవాటు తో ఉండే ఐదేళ్ళ వయసు దాకా పిల్లలూ పాలు తాగుతారని ఒక అధ్యయనం చెపుతోంది కొన్ని వందల మందితో చేసిన ఈ అధ్యయనంలో పాలు ఇష్టంగా తాగుతారు కనక,ఆ అలవాటు పిల్లలకూ చేస్తారని పరిశోధకులు అన్నారు . అయితే ఇదే అంశాన్ని వారు అన్ని విషయాలకు జోడిస్తున్నారు . తల్లుల్లు ఉండే అధ్యయనపు అలవాటు,ఉదయాన్నే లేచే అలవాటు,భోజనపు అలవాట్లు సంస్కృత సంప్రదాయాల పట్ల,పెద్దల పట్ల గౌరవం,కుటుంబాన్ని నిలుపుకునే చాకచక్యం . స్నేహితులతో ,బంధువులతో ప్రేమానురాగాలతో ఉండే అలవాట్లు,ఇలాంటివి తప్పని సరిగా కూతుళ్ళను నేర్పుతారని,తల్లికి ఉండే సౌజన్యం,స్నేహ పాత్రలో కూతుళ్ళకి వారసత్వంగా రావటం అంటే ఇదే నంటున్నారు పరిశోధకులు . తల్లుల కుండే అలవాట్లే పిల్లలకు వస్తాయని చెప్పేశారు వాళ్ళు .