Categories
పండగ కోసం ప్రాక్టీస్ చేసే దాండియా,కోలాటం డాన్సుల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఎక్సపర్ట్స్. ఈ నృత్యాలతో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతోంది నడుము దగ్గర చేతుల దగ్గర కొవ్వు తగ్గిపోతుంది. ఒత్తిడి అదుపులోకి వస్తుంది. శరీరాన్ని వేగంగా కదిలిస్తూ,కింద కూర్చొని లేస్తూ వేగంగా ఆడే ఆటని ఒక గంట పాటు చేస్తే వంద నుంచి ఐదు వందల వరకు కేలరీలు కరిగి పోతాయి. ఇది మంచి వ్యయామం కూడా. గుండెకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతోంది. ఊపిరి తిత్తులు పని తీరు పెరుగుతోంది. పండగ సందర్భంలో అమ్మవారికి చేసే రుచిగా ఉండే ప్రసాదం కాస్త ఎక్కువే తీసుకున్న ఈ నృత్యంతో ఆ క్యాలరీలు కరిగించేసుకోవచ్చు.