ఎన్నెనో రకాల హెయిర్ స్టయిల్స్. అసలు మోకానికి అందం ఇచ్చేదే జుట్టు. సముద్రపు అలాల్లాంటి నీలిమేఘాల్లాంటి జుట్టుతో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హెయిర్ స్టయిలిస్ట్ తో ఎన్నెనో ప్రయోగాలు చేసారు. ప్రతి సినిమాలో హీరోయిన్  ఒక కొత్త లుక్ లో కనబడిందీ  అంటే దాదాపు కొత్త హెయిర్ స్టయిల్ ప్రయోగం ముందుంటుంది. హై పోనీ ,లో పోనీ ..ఇవన్నీ పాత సస్టయిల్స్ ఇప్పుడంతా సైడ్ పోనీదే హవా. నడుస్తోంది. లూజ్ గా  హెయిర్ వదిలేయటం సరే. పక్కకు తెచ్చేసారు హెయిర్ స్టయిలిస్టులు. బ్యాక్ ఫ్యాషన్స్ కి అడ్డం రాకుండా జ్యూవెలరీ హుక్స్ కి చిక్కులు పడకుండా ముందు నుంచి చూసేవాళ్ళకి రెండు జాడలేమో అనిపించేలా కాన్లీ లుక్ తో ఉందీ ఫ్యాషన్. ఈ సైడ్ పోనీ కోసం అందమైన జ్యూవెలరీ కూడా  వచ్చేసింది.చక్కని పిన్స్ దువ్వటంతో ఎన్నో రకాలు జడలు వేసి ఈ సైడ్ పోనీకి హైలైట్ చేసేసారు. వేసుకునే విధానం జడలు అలంకరించు కోవటం కూడా వీడియోలున్నాయి చూడచ్చు.

Leave a comment